
నర్వ, వెలుగు: రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లు అమ్ముకోవాలని మక్తల్ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సూచించారు. శనివారం సిపూర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి, మాట్లాడారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ఆలోచనతో సీఎం రేవంత్‌రెడ్డి ముందుకెళ్తున్నారని తెలిపారు. సిపూర్ లో మహిళా సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశామని చెప్పారు. ధాన్యాన్ని దళారులకు విక్రయించొద్దని, కొనుగోలు సెంటర్లకు తీసుకువచ్చి, రూ.500 బోనస్ పొందాలన్నారు.
గత వానాకాలం సీజన్‌కు సంబంధించి నర్వ మండలానికి రూ.4 కోట్ల బోనస్ ఇచ్చామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బీసం చెన్నయ్య సాగర్, డీసీసీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, డీఆర్డీఏ పీడీ మొగులన్న, తహసీల్దార్ మల్లారెడ్డి, మహిళా సమాఖ్య మండల అధ్యక్షురాలు కవిత తదితరులు పాల్గొన్నారు.
వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠ
మక్తల్, వెలుగు: మండలంలోని గడ్డంపల్లిలో వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠ శనివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, బీజేపీ నాయకుడు కొండయ్య హాజరయ్యారు.